ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం వెంగముక్కలపాలెంలో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మదర్ థెరిస్సా కాలనీలో ఇంటికి సమీపంలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం నిలిపాడని సాయి కుటుంబానికి.. సమీప బంధువులు మధ్య వివాదం చెలరేగింది.
సెప్టిక్ ట్యాంక్ వాహనం కోసం గొడవ... యువకుని హత్య - vengamukkapalem man murder news
సెప్టిక్ ట్యాంక్ వాహనం నిలిపి ఉంచాడని మెుదలైన గొడవ.. యువకుడు హత్యకు దారి తీసింది. ఈ సంఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా వెంగలముక్కలపాలెంలో జరిగింది.
ఏపీలో సెప్టిక్ ట్యాంక్ వాహనం కోసం గొడవ.
ఆ సమయంలో ఇరువైపు కుటుంబ సభ్యులు మద్యం సేవించి ఉన్నారు. సుమారు 10 మంది వ్యక్తులు సాయిపై మూకుమ్మడిగా దాడి చేయటంతో.. సంఘటనా స్థలంలోనే స్పృహతప్పి పడిపోయాడు. సాయిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. సాయి మృతికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.