తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... వ్యక్తి మృతి - Road accident at Amber Peta Polytechnic College

అంబర్​పేట పాలిటెక్నిక్​ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ బైక్​ను ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Man killed in RTC bus accident at Amber Peta Polytechnic College, Hyderabad
Man killed in RTC bus accident at Amber Peta Polytechnic College, Hyderabad

By

Published : Nov 12, 2020, 12:48 PM IST

హైదరాబాద్ అంబర్​పేట పాలిటెక్నిక్​ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు... బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అంబర్​పేట ప్రధాన రహదారిపై ఆర్టీసీ సిటీ బస్​.. బైక్​పై వెళ్తున్న మహమ్మద్​ ఫరూక్​(35) అనే వ్యక్తిని ఢీకొట్టింది. బస్సు వెనక టైర్​ కింద పడటం వల్ల ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఉస్మానియా మార్చురికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతి చెందిన వ్యక్తి కర్నులు జిల్లాకు చెందినట్లుగా గుర్తించారు. అంబర్​పేటలో ఉండే మహమ్మద్​ ఫరూక్​ శ్రీనిధి కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఉదయం ఇంట్లో నుంచి బయలు దేరి.. కాలేజికి వస్తుండగా కొద్ది నిమిషాల్లోనే మృత్యువాత పడ్డారు.

ఇవీచూడండి:కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృతి

ABOUT THE AUTHOR

...view details