లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొండసముద్రం గ్రామానికి చెందిన తాటిపర్తి చంద్రమౌళి తాపీ మేస్త్రి. కరీంనగర్ లో ఉంటూ కూలి పనిచేసుకుని బతుకుతుండే వాడు.
ఈ క్రమంలో మీర్జాపూర్ కు చెందిన ఓ గిరిజన వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా వారిని వదిలేసి తనను వివాహం చేసుకోవాలని చంద్రమౌళి బలవంత పెట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబ సభ్యులు శనివారం ఉదయం చంద్రమౌళిపై పట్టణంలోని నాగారం రోడ్ లో దాడి చేశారు.