తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భూ వివాదాలతో గ్రానైట్ రాయితో కొట్టి చంపేశాడు! - man murdered by his uncle

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో భూవివాదాల వల్ల సాయికుమార్​ అనే వ్యక్తిని తన సొంత చిన్నాన్నే అంతమొందించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు. అయితే సాయికుమార్​పై అంతకుముందు ఆరు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

man murdered by his uncle
భూవివాదాల వల్ల సొంత చిన్నాన్న చేతిలోనే హత్యకు గురయ్యాడు

By

Published : Aug 31, 2020, 4:39 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలో సాయికుమార్​ అనే వ్యక్తిని భూవివాదాల వల్ల చిన్నాన్నే హత్య చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. అమీన్​పూర్​కు చెందిన సాయికుమార్​, చిన్నాన్న పూర్ణచందర్​కు గత కొంతకాలంగా భూవివాదాలు జరుగుతున్నాయి.

తరచూ మద్యం తాగి.. పూర్ణచందర్​ వద్దకు వెళ్లి సాయికుమార్ గొడవపడుతూ ఉండేవారు. ఆదివారం రాత్రి కూడా ఇలాగే వెళ్లగా.. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. విసిగిపోయిన పూర్ణ.. సాయికుమార్​ను గ్రానైట్​ రాయితో తలపై బలంగా కొట్టగా అతను మరణించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే సాయికుమార్​ సైకోలా ప్రవర్తించేవాడని.. అందరినీ కొట్టి డబ్బులు లాక్కునేవాడని.. ఇలాంటి నేరాలకు పాల్పడినందుకు అతనిపై ఆరు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాయికుమార్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details