తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నారాయణఖేడ్​లో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Man hanged in narayakhed

తన దుకాణంలోనే ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణఖేడ్ లో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నారాయణఖేడ్ లో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jul 30, 2020, 7:35 PM IST

ఉరి వేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన రాజన్ పట్నాయక్... మూడు సంవత్సరాల నుంచి పట్టణంలో ఓ దుకాణం అద్దెకు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు.

బుధవారం రాత్రి తన దుకాణంలో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details