చెట్టు కొమ్మలు కొడుతూ... అదే చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రగాయాలకు గురైన ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్‌లో నివసించే గణేశ్ మేకలు మేపుతూ జీవిస్తున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్ నంబర్ 4 లో ఓ చెట్టు కొమ్మలను కొడుతున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు.
చెట్టు కొమ్మలు కొట్టబోయి నాలాలో పడిన యువకుడు - a man fall from tree
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఓ యువకుడు ప్రమాదవశాత్తు నాలాలో పడ్డాడు. తన మేకల కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా... ప్రమాదవశాత్తు జారి నాలాలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది బాధితున్ని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.
man fall in nala from tree at kukatpally
కొమ్మలు కొడుతున్న చెట్టుపై నుంచి పక్కనే ఉన్న నాలాలో గణేశ్ పడిపోయాడు. ఈ ఘటనలో బాధితుని తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో నాలాలో పడి ఉన్న గణేశ్‌ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలా నుంచి బాధితుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.