సూర్యాపేట జిల్లా హూజుర్నగర్ మండలం వేపలసింగారంలో విషాదం జరిగింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తోకల సైదులు(30) మృత్యువాత పడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి... కుటుంబానికి అతనే ఆధారం - suryapeta district dist news
అతను కూలిపనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా... కుటుంబ పెద్దగా ఉంటూ పోషిస్తున్నాడు. అతని పట్ల విధి చిన్నచూపు చూసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తనువు చాలించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి... కుటుంబానికి అతనే ఆధారం
భార్యభర్తలిద్దరూ కూలి పనులకు జీవనం సాగించేవారు. అతని తండ్రి చిన్నతనంలోనే చనిపోగా...కుటుంబాన్ని పోషించేవారు లేకుండా పోయారు. ఇద్దరు చిన్నపిల్లలు కాగా...ఎలా బ్రతకాలంటూ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం