పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువులో పడి పుట్టకోల్ల రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
గురువారం మధ్యాహ్నం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.