సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలోని స్పాన్సుల్ ఫార్మా లిమిటెడ్ కంపెనీలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో కార్మికుడు మరణించాడు. రసాయన పరిశ్రమలో సత్యం అనే కాంట్రాక్టర్ వద్ద గాజుల రామారంకు చెందిన నరసింహాచారి, ఉపేందర్, కృష్ణారెడ్డిలు పని చేస్తున్నారు.
విద్యుత్ షాక్తో కార్మికుడు మృతి.. కేసు నమోదు - సంగారెడ్డి వార్తలు
విద్యుత్ షాక్తో కార్మికుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వెల్డింగ్ చేయడం వల్ల విద్యుత్ షాక్ తగిలిందని.. ఇనుప రేకుకు విద్యుత్ ప్రవహించి ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.. కేసు నమోదు
ఇనుప రేకుపై డ్రమ్ములు వేసుకొని వాటిపై ఎక్కి పని చేస్తుండగా.. డ్రమ్ములకు విద్యుత్ తీగలు తగిలి నరసింహాచారి, కృష్ణారెడ్డి, ఉపేందర్లకు షాక్ కొట్టింది. ఉపేందర్ రెడ్డి, కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. నరసింహాచారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్టు తెలిపారు. గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :రానున్న కాలంలో రెట్టింపు వర్షాలు