హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ సంపులోకి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీమానాయక్, ఊమ్ల నాయక్‌లు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి తార్నాకలో నివాసముంటున్నారు.
సంపులో దిగి.. ఊపిరాడక వ్యక్తి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమలో డ్రైనేజీ సంపులోకి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
సంపులో దిగి.. ఊపిరాడక వ్యక్తి మృతి
ఉప్పల్ పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్నారు. మురుగును శుభ్రం చేసేందుకు సంపులోకి దిగారు. ఊపిరాడక కాసేపటికే బీమా నాయక్ మృతి చెందగా.. ఊమ్ల నాయక్‌ను పరిశ్రమలోని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.