కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి తీగను చోరీ చేసేవారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ శివారులోని ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి తీగను దొంగతనం చేయడానికి ప్రయత్నించారు.
ఈనెల 19న ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్‌ను నిలిపివేసి, రాగి తీగను తీసేందుకు యత్నించే క్రమంలో విద్యుత్ ప్రసారమై ముగ్గురిలో సంగమేశ్వర్(22) అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా ఇద్దరు అక్కణ్నుంచి పరారయ్యారు. తర్వాత సంగమేశ్వర్ మృతదేహాన్ని అక్కణ్నుంచి తీసుకురావడానికి పలుమార్లు యత్నించి విఫలమయ్యారు.