తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోలికెపాడులో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

వనపర్తి జిల్లా పోలికెపాడులో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లో విద్యుత్ తీగలను సరిచేసే క్రమంలో ఘటన చోటుచేసుకుంది.

పోలికెపాడులో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పోలికెపాడులో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

By

Published : Oct 8, 2020, 10:58 PM IST

ఇంట్లో విద్యుత్ తీగలను సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా పోలికెపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి బాలపీరు.. ఇంట్లో విద్యుత్ తీగలను సరి చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతుడి భార్య అనంతమ్మ 6 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: రెవెన్యూ చట్టానికి మద్దతుగా కరివెన వద్ద తెరాస కృతజ్ఞతా సభ

ABOUT THE AUTHOR

...view details