భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ సెక్టార్ సమీపంలో డంపర్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ లోని డంపర్లు, కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు.
సింగరేణి డంపర్ ఢీకొని వ్యక్తి మృతి.. గ్రామస్థుల ఆందోళన - dumper vehicle hit a man in bhupalpally
సింగరేణి ఓసీపీకి చెందిన డంపర్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ సెక్టార్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు, బంధువులు ఆందోళనకు దిగారు.
సింగరేణి డంపర్ ఢీకొని వ్యక్తి మృతి
గడ్డిగానిపల్లికి చెందిన లింగయ్యను డంపర్ ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న భూపాలపల్లి పోలీసులు గ్రామస్థులను శాంతించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూపాలపల్లి తహసీల్దార్ అశోక్ పరిస్థితిని సమీక్షించారు. మృతుని కుమారునికి సింగరేణి సంస్థలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఇదీ చూడండి :రీఛార్జ్ చేసుకోమన్నారు.. డబ్బు కాజేశారు...