మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బండర్పల్లికి చెందిన రామచంద్రం అక్కడికక్కడే దుర్మరణం చెందగా... మరో నలుగురికి గాయాలయ్యాయి.
ఆటోను ఢీ కొట్టిన ఆటో.. వ్యక్తి దుర్మరణం - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీ కొట్టిన ఆటో.. వ్యక్తి దుర్మరణం
దేవరకద్ర నుంచి మరికల్ వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన మరో ఆటో ఢీ కొట్టింది. గాయాలపాలైన సత్యమ్మ, చంద్రకళ, నరసమ్మతో పాటు మూడేళ్ల బాలుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నచింతకుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Last Updated : May 29, 2020, 10:27 PM IST