భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండాకు చెందిన జువాలి కృష్ణ హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామానికి చెందిన యువకుడి వివాహ నిశ్చయ తాంబూలాల శుభకార్యానికై డోర్నకల్ వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు.
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శుభకార్యానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా.. వేగంగా ఎదురు వచ్చిన కారు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.
శుభకార్యానికి వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కృష్ణ ప్రయాణిస్తున్న ఆటోతో పాటు.. మరో ఆటోను కూడా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోతున్న కారును పోలీసులు లింగాల వద్ద పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.