నివాసంలో విద్యుత్ లేదని.. కరెంట్ బుడ్డి వైరును పట్టుకోగా విద్యుదాఘాతమై వ్యక్తి మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూర్ గ్రామంలో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసిన గొర్రెలు, మేకలు కాపలా కాస్తూ ముత్యం జీవనోపాధి పొందుతున్నాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో గొల్ల ముత్యం అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మరణించాడు. ఇంట్లో కరెంట్ రావాట్లేదంటూ విద్యుత్ వైరును పట్టుకోగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు
ముత్యంకు ముగ్గురు కూతుర్లుండగా.. ఇద్దరు కూతుళ్లకు ఇంకా వివాహం కాలేదు. ఇంటికి పెద్ద దిక్కైన ముత్యం మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండిఃఎస్సార్ నగర్లో కరెంట్ షాక్ తగిలి.. బార్ క్యాషియర్ మృతి