పని చేయకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తావని భార్య మందలించడం వల్ల నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్లలో బండారి రవి(33) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈనెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 ఆంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - man committed suicide in nirmal district due to family issues
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్లలో పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు.

సోన్ మండలంలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
చికిత్స పొందుతూ రవి సోమవారం మృతి చెందినటలు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి :ఇంటిపై పిడుగు... సమీపంలోని రెండు గేదెలు మృతి