తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాటర్​ ట్యాంక్ ​పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - మేడ్చల్​ జిల్లాలో వాటర్​ ట్యాంక్​ పైనుంచి దూకిన వ్యక్తి వార్తలు

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి.. వాటర్​ ట్యాంక్ ​పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Man committed suicide by jumping from water tank in medchal district
వాటర్​ ట్యాంక్ ​పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

By

Published : Aug 4, 2020, 7:01 AM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గాగిల్లాపూర్​కు చెందిన​ మాలోత్ విఠల్ పెయింటర్​గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన విఠల్​.. స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్​ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్థానికులు దుండిగల్​ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన డయల్​ 100

ABOUT THE AUTHOR

...view details