అనంతపురం జిల్లా కదిరిలో భార్యతో గొడవపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏం జరిగిందంటే?
అనంతపురం జిల్లా కదిరిలో భార్యతో గొడవపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏం జరిగిందంటే?
కడప జిల్లా రాయచోటి మండలం కె.రామాపురానికి చెందిన శివశింకర్.. సెలూన్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్యతో గొడవపడి.. అనంతపురం బస్సు ఎక్కి కదిరి వెళ్లిపోయాడు. మనస్తాపంతో గాజు సీసా ముక్కతో వలీసాబ్ రోడ్డులో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.
రక్తపుమడుగులో ఉన్న శివశంకర్‌ను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితుడిని కదిరి ప్రభుత్వాసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య వేధించటంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితుడు తెలిపాడని పోలీసులు చెప్పారు.
ఇవీచూడండి:భార్య మరణంతో మనోవేదనకు గురై ఆత్మహత్య