భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఇంటి ముందు ఓ వ్యక్తి గొంతు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. టేకులపల్లి మండలం దాసుతండాలో బాణోత్ రామ ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని 108లో కొత్తగూడెం వైద్యశాలకి తరలించి చికిత్స చేస్తున్నారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం - ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ
ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే కంపెనీలో తన కుమారుడికి కూడా ఒకే షిప్టు విధులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే ఇంటి ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సింగరేణి ఉపరితల గనిలో ఓ ప్రైవేటు కంపెనీ నందు బానోత్ రామ తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అతని కుమారుడు, తనకు ఇద్దరికీ ఒకే షిఫ్ట్ విధులు వేస్తున్నారని... మార్పులు చేయాలని పలుమార్లు కోరినా చేయకపోవడంతో ఈ చర్యకు పాల్పడినట్లు టేకులపల్లి ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి :అన్నం పెట్టలేదని గొంతు నులిమి... భార్యని చంపేశాడు!
TAGGED:
yellandu latest news today