ఆస్పత్రి భవనంపై నుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు
![ఆస్పత్రి భవనంపై నుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య man-commits-suicide-by-jumping-from-a-hospital-building](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10273351-721-10273351-1610868621435.jpg)
12:43 January 17
కొండాపూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో విషాదం..
రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనం రెండో అంతస్తు నుంచి దూకి నారాయణ(77) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి కరోనా రోగిగా ఆస్పత్రి వర్గాలు గుర్తించాయి. కొద్ది రోజులుగా మానసిక పరిస్థితి బాగాలేక బాధపడుతున్నట్లు తెలిపాయి. ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి :జల్లికట్టుకు మరో ప్రాణం బలి