పెద్దపెల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని వాగుగడ్డలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని సాయి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య - మంథనిలో వ్యక్తి ఆత్మహత్య వార్తలు
అప్పుల బాధతో ఓ వ్యక్తి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అప్పుల బాధతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
గ్రామానికి చెందిన సాయి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా అప్పుల బాధతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఉదయం ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి:ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం