యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాణాల రాములు అనే వ్యక్తి పట్టణంలో తన కుమార్తె వద్ద ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రాములును మందు సేవించవద్దని కుటుంబ సభ్యులు వారించారు.
రైలు కింద పడి వృద్ధుని ఆత్మహత్య.. క్షణికావేశంలో నిర్ణయం - bhuvanagiri railway station
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మద్యం సేవించవద్దని వారించడం వల్ల క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
రైలు కింద పడి వృద్ధుని ఆత్మహత్య
వారితో వాగ్వాదానికి దిగిన రాములు.. క్షణికావేశంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.