ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ పేరుతో అమ్మాయిలకు వల - rx 100 director ajay news
![ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ పేరుతో అమ్మాయిలకు వల CYBER CRIME IN HYDERABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7869941-92-7869941-1593763603272.jpg)
06:21 July 03
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ పేరుతో అమ్మాయిలకు వల
సినీ దర్శకుడు అజయ్ భూపతి పేరుతో ఓ వ్యక్తి అమ్మాయిలకు వల వేశాడు. ఫేస్బుక్లో అమ్మాయిల వివరాలు సేకరించి వాట్సాప్ ఛాటింగ్ చేశాడు. అనంతరం అమ్మాయిల ఫొటోలు సేకరించి.. వేధింపులకు గురిచేశాడు.
త్వరలో తాను హీరో విజయ్ దేవరకొండ, విశాల్‌లతో తీయబోయే సినిమాలలో అవకాశం కల్పిస్తానని అమ్మాయిలను నమ్మించాడు. వారి నుంచి ఫొటోలు సేకరించి వేధిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్... హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిని పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.