మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో పోలీసులు చూస్తుండగానే... స్థిరాస్తి వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. కూకట్పల్లి నివాసి జావిద్పై నిందితుడు గొడ్డలితో దాడి చేశాడు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దుండిగల్లో తన ఫ్లాట్ చూపిస్తానని పిలిచిన బంధువు దాడికి పాల్పడ్డాడు. బాధితుడిని సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఫ్లాట్ చూపిస్తానని పిలిచి గొడ్డలితో దాడి.. పోలీసులే సాక్ష్యం.. - స్థిరాస్తి వ్యాపారిపై గొడ్డలితో దాడు
ఫ్లాట్ చూపిస్తానని పిలిచి స్థిరాస్తి వ్యాపారిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన... దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇదంతా పోలీసుల కళ్లముందే జరిగింది.
ఫ్లాట్ చూపిస్తానని పిలిచి.. గొడ్డలితో దాడి