కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన తెల్ల శివ కల్యాణ్.. గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ ధూల్‌పేట నుంచి గంజాయి తెచ్చి గంగాధర మండలంలోని యువకులకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ - అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన తెల్ల శివ కల్యాణ్‌గా గుర్తించారు.
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
గంగాధర పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన దండవేని హరీశ్‌తో కలిసి రెండు మండలాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. గంజాయి పట్టుకున్న పోలీసులను సీపీ కమలాసన్ రెడ్డి అభినందించారు.