హైదరాబాద్ పాతబస్తీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని దక్షిణమండల కార్యదళం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.70 వేల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీలో ఎన్నికల పోలింగ్ ఉండడంతో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
పాతబస్తీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - హైదరాబాద్ నేర వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించినా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని దక్షిణమండల కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.70 వేల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పాతబస్తీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.