తెలంగాణ

telangana

By

Published : Feb 5, 2021, 5:09 PM IST

ETV Bharat / jagte-raho

ఇన్​స్టాలో అమ్మాయిలతో పరిచయం.. అశ్లీల చిత్రాలతో వేధింపుల పర్వం

ఇన్​స్టాగ్రామ్​లో అమ్మాయిలను పరిచయం చేసుకొని ఆపై వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపి.. వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు.

Man arrested for harassing girls on Instagram in hyderabad
ఇన్​స్టాలో పరిచయం చేసుకుంటాడు.. ఆపై వేధిస్తాడు

అమ్మాయిలే అతని టార్గెట్​.. ఇన్​స్టాగ్రామ్​లో మొదటగా యువతులతో పరిచయం చేసుకుంటాడు. కొన్ని రోజులు బాగానే స్నేహం చేస్తాడు. ఆ తర్వాతే తెలుస్తుంది అతడి వక్రబుద్ధి. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపి వేధిస్తుంటాడు. ఓ మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. ఐపీ అడ్రస్​ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం రామన్నగూడెంకు చెందిన సంతోష్ కుమార్. ఇతను మహారాష్ట్ర ఔరంగాబాద్​లో ఓ ప్రైవేటు కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:ఇన్​స్టాలో అమ్మాయిల పేరుతో ఖాతా.. ఆపై బెదిరింపులు

ABOUT THE AUTHOR

...view details