ఎలక్ట్రీషన్ అని చెబుతూ అపార్ట్‌మెంట్లలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కాజం అలీఖాన్ అనే నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌తోపాటు.. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో కలిపి ఇప్పటివరకు నిందితుడు 70 దొంగతనాలు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
70 దొంగతనాలు చేసిన వ్యక్తి అరెస్టు - సైబరాబాద్ సీపీ సజ్జనార్ తాజా వార్తలు
అపార్ట్‌మెంట్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు 70 దొంగతనాలు చేసిన నిందితుడు కాజం అలీఖాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి 1,040 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ రూ.52 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
70 దొంగతనాలు చేసిన వ్యక్తి అరెస్టు
ఆగస్టు నుంచి ఇప్పటివరకు 16 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుని నుంచి వెయ్యి40 గ్రాముల బంగారు ఆభరణాలు, 40వేల నగదు, 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ 52 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే దొంగతనాలు చేసే కాజం అలీఖాన్... ఆ సొమ్ముతో విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తాడని సీపీ తెలిపారు.
ఇదీ చూడండి : సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్టు.. రూ.30 లక్షల విలువైన ఫోన్లు స్వాధీనం