మేడ్చల్ మల్కాజ్గిరి జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు ఓ విటుడు, పలువురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విధంగా..
కలకత్తాకు చెందిన నిర్వాహకురాలు గత కొన్ని నెల్లుగా దమ్మాయిగూడెంలో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహించింది. కలకత్తా నుంచి యువతులను తీసుకొచ్చి వాళ్ల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. అలా ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో విటులను ఆకర్షించింది. భేరసారాలు మాట్లాడుకొంటూ విటులను రప్పించి పోలీసులు కళ్లుగప్పి వ్యభిచారం కొనసాగించింది.