తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్​గా మార్చేశారు' - మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి రిమాండ్ రిపోర్టు

మల్కాజిగిరి ఏసీపీ అక్రమాస్తుల కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని.. వారిలో 11 మందిని అరెస్ట్​ చేయగా మరో ఇద్దరిని గాలిస్తున్నట్లు అనిశా అధికారులు తెలిపారు. హైదరాబాద్​ హైటెక్​ సిటీలో రెండు వేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్​ భూమిగా మార్చడంలో నర్సింహారెడ్డికి మిగతా 12 మంది సాయం చేసినట్లు అనిశా పేర్కొంది.

malkajgiri acp narsimhareddy remand report given by acb
'రెండు వేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్​గా మార్చేశారు'

By

Published : Oct 5, 2020, 2:15 PM IST

Updated : Oct 5, 2020, 3:34 PM IST

మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి అదనపు ఆస్తుల కేసులో మొత్తం 13 మందిని అవినీతి నిరోధక శాఖ నిందితులుగా గుర్తించింది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్​ చేసిన అనిశా అధికారులు పరారీలో ఉన్న మరో ఇద్దరిని గాలిస్తున్నామని తెలిపారు. హైటెక్​ సిటీ ప్రాంతంలో విలువైన ప్రభుత్వ భూమిని ఏసీపీ నర్సింహారెడ్డి కబ్జా చేసేందుకు ఏ2 నుంచి ఏ13 సహకరించారని తెలిపారు. సర్వే నెంబర్ 64లో రూ. 60 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి రెండువేల గజాల భూమిని విభజించి నాలుగు డాక్యుమెంట్లు సృష్టించాలని అధికారులు వెల్లడించారు.

తొలుత తండ్రుల పేరిట రిజిస్ట్రేషన్​ చేసి.. తర్వాత కుమారుల పేరిట గిఫ్ట్​ డీడ్​గా మార్చారని.. అక్కడి నుంచి ఏసీపీ.. భార్య పేరుతో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడని చెప్పారు. రెండు వేల గజాలు ప్రభుత్వ భూమేనని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. భూమిపై ఎలాంటి హక్కు లేకున్నా.. ఎంతో చాకచక్యంగా భూమిని ప్రైవేటుగా నిందితులు మార్చారని అధికారులు అన్నారు. నర్సింహారెడ్డికి సంబంధించి హైదరాబాద్​లో 4 నివాస గృహాలు, ఏపీలోని అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమిని బినామీ ఆస్తులుగా అనిశా గుర్తించింది.

ఇదీ చదవండిఃఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

Last Updated : Oct 5, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details