తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు - malkajgiri acp arrest

ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు
ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు

By

Published : Sep 24, 2020, 7:49 AM IST

Updated : Sep 24, 2020, 10:31 AM IST

07:45 September 24

ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ నర్సింహారెడ్డిని అరెస్టు చేసిన అధికారులు... ఇవాళ అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.  నర్సింహారెడ్డికి సంబంధించిన ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు లాకర్లను అనిశా అధికారులు తెరవనున్నారు. నర్సింహారెడ్డి అక్రమాస్తులపై అతని స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమరి మండలం పూల ఓబయ్యపల్లిలో విచారణ జరిపారు. వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు. 

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో హైదరాబాద్​తో పాటు వరంగల్, జనగాం కరీంనగర్, నల్గొండ, ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సింహారెడ్డి గతంలో ఉప్పల్‌, మియాపూర్​లో సీఐగా పనిచేశారు. పలు భూవివాదాల్లో తలదూర్చి రాజీ చేసినట్టు నర్సింహారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీపీ నర్సింహారెడ్డి పై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై నిఘా పెట్టిన అనిశా అధికారుల దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్​లోని అతని నివాసంతో పాటు అతని స్నేహితులు, బంధువులు, బినామీల ఇళ్లపై బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకూ రూ.70కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది.

పలు ప్రాంతాల్లో ఆస్తులు

అనంతపురం లో 55ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించిన అధికారులు....హైదరాబాద్​లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన హైటెక్ సైబర్ టవర్స్ వద్ద 1960 గజాల నాలుగు ఇళ్ల స్థలాలు, మరో రెండు ఇళ్ల స్థలాలు, హఫీజ్ పేటలో మూడు అంతస్థుల వ్యాపార సముదాయం, నగరంలో రెండు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు ఇంట్లో 15లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లతో పాటు స్థిరాస్తి వ్యాపారం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనిశా గుర్తించింది. దీంతో పాటుగా యాదాద్రిలోని అతని బినామీ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: అనిశాకు చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి


 

Last Updated : Sep 24, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details