హైదరాబాద్ నాచారంలో వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల గురించి ఆరాతీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనం చేసిన వారు భార్యభర్తలు కాదని.. పక్కా ప్రణాళికతోనే ఇంట్లో పనికి చేరినట్లు తేలింది. ఇంట్లో పనిచేసేందుకు భార్యభర్తలు కావాలనడంతో మరో మహిళతో పనిలో కుదిరినట్లు పోలీసులు చెబుతున్నారు.
నాచారం చోరీ కేసులో వెలుగులోకి కీలక విషయాలు - నేపాల్ వాసుల దొంగతనం
హైదరాబాద్ నాచారంలో వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనం చేసిన వారు భార్యభర్తలు కాదని, వారిద్దరు పక్కా ప్రణాళికతోనే ఇంట్లో పనికి చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఒకటి,రెండు రోజుల్లో వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
నాచారం చోరీ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
పనిమనుషులుగా చేరిన తర్వాత ప్రధాన సూత్రధారి గోవింద్ నేపాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి చోరీ ఎలా చేయాలి, ఎలా నేపాల్‌కు తిరిగిరావాలనే విషయాలు వివరించి వెళ్లాడు. చోరీకి పాల్పడ్డ మాయ, అర్జున్ ఇప్పటికే నేపాల్ సరిహద్దులకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకటి, రెండ్రోజుల్లో అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశముంది.