విజయవాడ గ్యాంగ్‌వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠ అరెస్ట్ అయ్యాడు. హత్యకు వినియోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో 33 మందిని అరెస్ట్ చేసినట్లు పటమట పోలీసులు తెలిపారు.
విజయవాడ గ్యాంగ్‌వార్: ప్రధాన నిందితుడు పండు అరెస్ట్ - pandu arrest
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన కత్తులను స్వాధీనం చేసుకుని... పండును కోర్టులో హాజరు పరిచామని పటమట పోలీసులు తెలిపారు.
vijayawada gang war
పరారీలో ఉన్న మరో 15 మంది కోసం గాలిస్తున్నట్ల తెలిపారు. వీరి కోసం 6 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్లు చెప్పారు. ఘర్షణ పడ్డ వారిపై రౌడీ షీట్లు తెరవనున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర ఎక్కువగా ఉన్నవారికి నగర బహిష్కరణ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.
Last Updated : Jun 14, 2020, 10:57 AM IST