తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పురుగుల మందుతాగి డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ ఆత్మహత్య - మహబూబ్‌నగర్ ఫారెస్ట్‌ ఆఫీసర్ ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లాలో డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్‌ వహిదా బేగం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తన కుమార్తె మృతికి భర్తే కారణమంటూ.. వహీదా బేగం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

forest officer
forest officer

By

Published : Aug 12, 2020, 10:53 PM IST

మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ అటవీ శాఖ కార్యాలయం డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వహిదా బేగం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన కాసేపటికి ఈ విషయం తోటి ఉద్యోగులకు చెప్పింది. కార్యాలయ ఉద్యోగులు మహమ్మదాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కుమార్తె మృతికి భర్తే కారణమంటూ.. వహీదా బేగం తల్లి మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details