నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహేంద్ర ట్రాక్టర్షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ మృతిపై అతడి భార్య అనుమానం వ్యక్తం చేసింది. బుధవారం ఉదయం ఐదు గంటలకు తోటి మెకానిక్‌తో కలిసి షోరూంకి వెళ్లాడని పేర్కొన్నారు. తలపై గాయం ఉందని, మృతదేహాన్ని కారులోనే ఉంచారని మృతుని భార్య కావ్య ఆరోపించింది. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు షోరూంలోనే భైఠాయించారు.
అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి
నిజామాబాద్ నగరంలోని మహేంద్ర ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న మెకానిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోజుమాదిరి గానే బుధవారం ఉదయం విధులకు వచ్చిన శ్రీనివాస్‌కు పిట్స్ రావడం వల్ల ఆస్పత్రికి తరలించగా... గుండెపోటుతో మృతి చెందాయడని షోరూం నిర్వాహకులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి
విధులకు హాజరైన శ్రీనివాస్ పనిలో భాగంగా పెర్కట్ వెళ్లాడని అక్కడ పిట్స్ రావడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లగా... గుండెపోటుతో మృతి చెందాడని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా తదుపరి విచారణ కొనసాగిస్తామని రూరల్ ఎస్‌హెచ్‌వో మధుసూదన్ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి:బెడిసికొట్టిన రిపోర్టర్ డీలింగ్... ట్రాప్‌లో పడి కిడ్నాప్