తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దీక్షిత్‌ హత్యకేసు.. రివర్స్​ ట్రాకింగ్​తో పట్టుబడ్డ నిందితుడు - Deekshith murder case latest news

చిన్నారి దీక్షిత్ హత్యకేసులో నిందితుణ్ని... సైబర్‌ క్రైం పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. సాంకేతికతను ఉపయోగించి వేర్వేరు నెట్‌వర్క్‌ల ద్వారా... నిందితుని కదలికలపై పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుణ్ని పట్టుకునేందుకు సాయం చేశారు.

Mahabubabad Police have nabbed the accused with reverse tracking in the Dixit murder case
దీక్షిత్‌ హత్యకేసు.. రివర్స్​ ట్రాకింగ్​తో పట్టుబడ్డ నిందితుడు

By

Published : Oct 23, 2020, 7:22 AM IST

ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా సంబంధిత వ్యక్తులు ఎక్కడున్నారో తెలుసుకోవడం కష్టమే. పోలీసులు రివర్స్ ట్రాకింగ్ ద్వారా పరిశోధించి.. ఫోన్‌కాల్స్‌ను విశ్లేషించి... దీక్షిత్‌ హత్యకేసు నిందితుడు సాగర్‌ను గుర్తించారు. మొబైల్‌ యాప్‌ల సాయంతో సైబర్‌ నేరగాళ్లు విదేశాల్లోని ఫోన్‌ నంబర్లను తమ ఫోన్‌లకు ఉపయోగిస్తున్నారు. వారు ఎవరికి ఫోన్ చేసినా... విదేశాల నుంచి కాల్ వచ్చినట్లు కనిపిస్తోంది. నెట్‌వర్క్‌ ప్రొవైడర్లకు కూడా ఈ సమాచారం ఉండకపోవడంతో.... సెల్‌టవర్ల ప్రాంతం గుర్తించడం కష్టమవుతోంది.

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి సైతం...

గతంలో కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు.... ఓ సైబర్ నేరస్తుడు ఇంటర్నెట్ కాల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దుబాయ్ నుంచి ఫోన్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. పోలీసుల విచారణలో కువైట్‌లో కారు డ్రైవర్‌గా పనిచేసే కడపవాసి ఇస్మాయిల్‌ అని తేలింది. గతేడాది కడపకు తిరిగి వస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయంలో అతణ్ని అరెస్టు చేశారు.

సైబర్​క్రైం సాయంతో...

దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన నిందితుడు సాగర్‌ ఇదే తరహాలో ఇంటర్నెట్ కాల్‌ ఉపయోగించడంతో.. మహబూబాబాద్‌ పోలీసులు హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసుల సాయం కోరారు. సైబర్ క్రైం బృందం సాంకేతికతను ఉపయోగించి... మూడు రోజులపాటు వేర్వేరు నెట్‌వర్క్‌ల ద్వారా సమాచారాన్ని సేకరించి... నిందితుని కదలికలపై పోలీసులకు సమాచారమిచ్చింది. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు సాగర్‌ను అరెస్ట్ చేశారు.

రివర్స్​ ట్రాకింగ్​తో

నిందితుడు మొబైల్ యాప్‌ సాయంతో విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అతడి ఆచూకీ తెలియకపోవడంతో... సైబర్ క్రైం పోలీసులు రివర్స్ ట్రాకింగ్‌ను ఎంచుకున్నారు. ఆ నంబర్‌తో దీక్షిత్ తల్లిదండ్రులకు కాకుండా ఇంకా ఎవరికైనా కాల్స్‌ వచ్చాయా అనే వివరాలు తెలుసుకున్నారు. ఫోన్ చేసిన సమయాన్ని రికార్డ్ చేసుకుని ఆ సమయంలో ఏ నెట్‌వర్క్‌ నుంచి ఫోన్‌ వచ్చిందో... నెట్‌వర్క్ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించారు. అదే సమయంలో 50 కిలోమీటర్ల పరిధిలో ఎన్ని సెల్‌ఫోన్‌లు పనిచేస్తున్నాయనే జాబితాను సిద్ధం చేసుకున్నారు. అక్కడి నుంచి కిలోమీటర్ల పరిధి సెల్‌ఫోన్‌ల సంఖ్యను తగ్గించుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల పరిధిలో కొన్ని సెల్‌ఫోన్‌లు నిలిచాయి. ఆయా నంబర్లు పరిశీలించగా... మందసాగర్‌ తన ఫోన్‌ ద్వారా మాట్లాడుతున్నట్లు రుజువులు లభించాయి. ఆ ఆధారాల ద్వారా పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు.

సంబంధిత కథనాలు...

  1. జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!
  2. తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?
  3. 24 గంటలు దాటినా లభించని బాలుడి ఆచూకీ
  4. మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య
  5. కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి
  6. బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ABOUT THE AUTHOR

...view details