మహబూబాబాద్‌లో అపహరణకు గురైన దీక్షిత్‌రెడ్డి మరణవార్త విని... బాలుడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. జిల్లా కేంద్రంలోని క్రిష్టకాలనీలో నివాసం ఉంటున్న జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఆదివారం కిడ్నాప్‌కు గురయ్యారు. అపహరణకు గురైన కొద్దిసేపటికి బాలుడి గొంతునులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
ఆపగలమా ఆ తల్లి శోకాన్ని.. ఓదార్చగలమా ఆ తండ్రిని... - Mahabubabad crime news
ఎవరాపగలరు ఆ తల్లి శోకాన్ని... ఎవరు ఓదార్చగలరు ఆ తండ్రి మౌన రోదనను. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇకలేడనే వార్తే... వాళ్లను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. కళ్ల ముందు తిరిగిన కొడుకు ఇక శాశ్వతంగా కనిపించడనే నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలో ఆ తల్లిదండ్రులకు తెలియడం లేదు. వాళ్ల దుఃఖాన్ని ఆపతరం ఎవరి వాళ్ల కావడం లేదు. డబ్బు కోసం కన్నతల్లి పేగు బంధాన్ని తెంచిన ఆ కసాయిని ఏంచేయాలి? డబ్బు ఇస్తామన్నా.. కూడా గొంతునులిమి చంపిన కిరాతకుడిని ఎలా శిక్షించాలి? ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు తీర్చాలి?
ఆపగలమా ఆ తల్లి శోకాన్ని.. ఓదార్చగలమా ఆ తండ్రిని...
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ డిమాండ్ చేసిన డబ్బును సిద్ధం చేసుకుని ఉంచారు. అయినా కూడా ఆ కసాయి బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. దీక్షిత్ ఇకలేడని తెలుసుకున్న తల్లిదండ్రుల వేదన వర్ణానాతీతం. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. బాలుడి మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్థానికులు పెద్దఎత్తున ఇంటికి చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:
Last Updated : Oct 22, 2020, 8:14 PM IST