తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే 1,013 గ్రాముల బంగారం, 3.2 కేజీల వెండి ఆభరణాలు, బ్రెజ్జా కారు, డియో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితుడు కర్ణాటక రాష్ట్రం బెంగళూర్ మంచనయకనహళ్లికి చెందిన ప్రకాష్‌గా గుర్తించారు. నిందితుడు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడేవాడని సీపీ వివరించాడు.
పగటిపూట నగరంలో తిరిగి... తాళం వేసి ఉన్న నివాసాలు, అపార్ట్మెంట్లు గుర్తించేవాడు. రాత్రి వెళ్లి తాళాలు పగలగొట్టి డబ్బు, నగలు అపహరించేవాడు. దొంగిలించిన ఆభరణాలను హైదరాబాద్ ముత్తూట్, పాన్ బ్రోకర్ల వద్ద తనఖా పట్టేవాడు. వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపేవాడని సీపీ వివరించారు.