విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం - lovers suicide news
![విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం lovers suicide In the Vikarabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7647207-1068-7647207-1592367513739.jpg)
06:01 June 17
విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవాబుపేట మండలం పూలపల్లి గ్రామశివారు పొలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు బలవన్మరణం చెందారు.
అసలేం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన ఎరుకల కార్తీక్, మీనాలు ప్రేమించుకున్నారు. వారం రోజుల కిందట మీనాకు మరో యువకునితో వివాహం జరిపించారు. నిన్న మధ్యాహ్నం నుంచి మీనా కనిపించకుండా పోయింది. ఇవాళ ఉదయం కార్తీక్‌తో కలిసి ఒకే తాడుతో పూలపల్లి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.