వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో ప్రేమికులు ప్రాణాలు వదిలారు.
అసలేం జరిగిందంటే?
వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో ప్రేమికులు ప్రాణాలు వదిలారు.
అసలేం జరిగిందంటే?
మల్రెడ్డిపల్లికి చెందిన బాలరాజు, ఓ బాలిక గత ఐదు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసి వాళ్లు నిరాకరించారు. తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడం వల్ల... కలిసి బతకలేమని భావించారు.
ఇద్దరు కలిసి మంగళవారం రాత్రి గ్రామ శివారులో ఉన్న పొలానికి వెళ్లారు. పొలంలోని ఓ గదిలో ఇద్దరు పురుగుల మందు తాగారు. ఆ విషయాన్ని తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అందరు వెళ్లి చూసేసరికి ఇద్దరు ప్రేమికులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో ప్రియురాలు మృతి చెందింది. బాలరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.