తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గర్భవతి చేసి వదిలేశావని నిలదీస్తే.. హెచ్​ఆర్సీలోనే కొట్టాడు! - ప్రేమ పేరుతో మోసం

ప్రేమించినప్పుడు తెలియలేదా? నాతో సంసారం చేసినప్పుడు ఆలోచించలేదా? నన్ను ప్రేమించాను అన్నావ్... జీవితాంతం కలిసి ఉంటాను అన్నావ్... అలాంటిది నీకు గవర్నమెంట్ జాబ్​ వస్తే నన్ను ఎలా వదిలేశావ్... ఎందుకు నన్ను మోసం చేశావ్.. నువ్వు నాకు కావాలి అంటూ ఓ యువతి ప్రియుడిని నిలదీసింది. ఈ ఘటన నాంపల్లిలో హెచ్​ఆర్సీ వద్ద చోటు చేసుకుంది.

lovers fight at hrc in nampally
'గర్భవతిని చేశావ్... ఉద్యోగం రాగానే వదిలేశావ్'

By

Published : Dec 31, 2020, 4:27 PM IST

Updated : Dec 31, 2020, 4:52 PM IST

ఓ యువతి, అశోక్​ కుమార్ అనే వ్యక్తి ప్రేమించుకున్నామని... జీవితాంతం కలిసి ఉంటానని హామీ ఇచ్చుకున్నామని... కానీ అతనికి ప్రభుత్వోద్యగం రాగానే ప్రియుడు మొహం చాటేశాడు అంటూ ఓ యువతి హెచ్​ఆర్సీలో ఫిర్యాదు చేసింది. కమిషన్ ముందు హాజరైన ప్రియుడిని ఆమె నిలదీసింది.

గర్భవతి చేసి వదిలేశావని నిలదీస్తే.. హెచ్​ఆర్సీలోనే కొట్టాడు!

''నన్ను ప్రేమించావ్.. దగ్గరికి తీసుకున్నావ్... గర్భవతిని చేశావ్... పెళ్లి చేసుకుంటానని చెప్పి అబార్షన్ చేయించావ్.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఎందుకు వదిలేశావ్. వేరే పెళ్లి చేసుకుని నన్ను ఎందుకు మోసం చేశావ్'' అంటూ యువతి బోరున విలపించింది. ఆగ్రహించిన అశోక్​ ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురికి సర్దిచెప్పారు. ప్రేమ పేరుతో తన జీవితంతో ఆడుకున్న అన్యాయం చేసిన అశోక్ కుమార్ నాయక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

ఇదీ చూడండి:ఫేస్​బుక్​ ద్వారా పరిచయం... ప్రేమ పేరుతో మోసం

Last Updated : Dec 31, 2020, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details