నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య - lovers committed suicide in nagarkarnool district
08:29 October 19
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. బల్మూర్ మండలం బిల్లకల్ గ్రామానికి చెందిన అఖిల.. బాణాల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ గత కొంత కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం నల్లమల అటవీ ప్రాంతంలోని రసూల్ చెరువు సమీపంలో ఫారెస్ట్ బేస్ క్యాంప్ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేట్టారు. వారి మరణానికి కారణాలు తెలియరాలేదు.
ఇదీ చదవండి:ప్రేమోన్మాదం: ఆరేళ్లలో 90 మంది అతివల బలి