పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య - Lovers commit suicide due to marital problems
![పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య lovers commits suicide in Nandipet, Nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10371183-776-10371183-1611561610573.jpg)
పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య
12:59 January 25
పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో ప్రేమికులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లి విషయంలో మనస్పర్థలు రావడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కుద్వాన్‌పూర్ వాసి సుకన్య(21), ఐలపూర్ వాసి ప్రేమ్(22)గా గుర్తించారు.
కుద్వాన్‌పూర్‌లో ఇంట్లో ఉరేసుకుని సుకన్య ఆత్మహత్య చేసుకోగా... ఐలాపూర్ చెరువు సమీపంలో ఉరేసుకుని ప్రేమ్ బలవన్మరణం చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
Last Updated : Jan 25, 2021, 2:59 PM IST