ఏపీ కడప జిల్లా చిట్వేలి - నెల్లూరు జిల్లా రాపూరు మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన 22 ఏళ్ల యాలకుల బాబు... అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల పులిశెట్టి అంజలి మృతిచెందినట్లు గుర్తించారు. వీరిద్దరూ ఈనెల 11 నుంచి కనిపించట్లేదని వారి బంధువులు పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఈనెల 13న ఫిర్యాదు చేశారు.
పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య - పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య
ఏపీ కడప జిల్లా చిట్వేలి రాపూరు అటవీ ప్రాంతంలో... పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
![పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య పురుగల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9192534-558-9192534-1602829433205.jpg)
నెల్లూరు జిల్లా రాపూర్ అటవీశాఖ సిబ్బంది... చిట్వేలి- రాపూరు మధ్య సంచరిస్తుండగా వీరిద్దరి మృతదేహాలు కనిపించాయి. వీరు మృతి చెందిన ప్రాంతంలో పురుగుల మందు, ద్విచక్రవాహనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరూ సంవత్సర కాలంగా ప్రేమలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అబ్బాయికి పెద్దలు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించగా... మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెనగలూరు ఎస్సై చెన్నకేశవ తెలిపారు.
ఇదీ చదవండి:వరదల్లో కోట్లు విలువ చేసే విల్లాలు