ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక్కటి కాకూడదని భావించారు. కానీ.. విడిపోయి బతకలేమని నిర్ధరించుకున్నారు. పెళ్లిలో ఒక్కటి కాలేకపోయినా.. చావులోనైనా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఒకేచోట ఉరేసుకుని తనువు చాలించారు.
కుశ్చితాల లోకంలో బతకలేక.. ప్రేమజంట బలవన్మరణం - జగిత్యాలలో ప్రేమ జంట ఆత్మహత్య
![కుశ్చితాల లోకంలో బతకలేక.. ప్రేమజంట బలవన్మరణం lovers-commits-suicide-at-hydarapalli-in-jagtial-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9555982-478-9555982-1605503248516.jpg)
10:01 November 16
ప్రేమజంట ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలోని హైదరపల్లిలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వచ్చి చూసేసరికి.. రెండు కుళ్లిపోయిన మృతదేహాలు వేలాడుతున్నాయి. అందరూ ఆశ్చర్యాలనికి గురయ్యారు.
హైదరపల్లికి చెందిన మధు... జగిత్యాలలో ఉండే సౌమ్య ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లితో ఒక్కటవ్వాలని ఆశపడ్డారు. జీవితం గురించి ఊహించుకుంటూ.. ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే పెద్దోళ్లకు విషయం తెలిసింది. ఇద్దరినీ మందలించారు. అప్పటికీ ఇంట్లో ఒప్పించే పెళ్లిచేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ.. ఫలితం లేదు.
పెద్దోళ్లను ఒప్పించకలేక.. వేరేవాళ్లతో జీవితాన్ని పంచుకోలేక... కుమిలిపోయారు. మరొకరితో బతకడం కంటే చావడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నారు. హైదరపల్లిలోనే ఓ పాడబడిన ఇంట్లో ఉరేసుకుని తనువు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య