నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ శివారు పొలాల్లో ఓ ప్రేమ జంట నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు షేక్ మస్తాన్ వాలీ, అశ్వినిగా గుర్తించారు. నిడమనూరు మండలం కుంటిగెర్లకు చెందిన షేక్ మస్తాన్ వాలీ, హుమయూన్నగర్కు చెందిన అశ్విని దివ్యాంగులు.
పాలెం శివారులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట
వారిద్దరు దివ్యాంగులు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఏమైందో తెలియదు ఆ ప్రేమ జంట నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ శివారులో జరిగింది.
ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట
వీరు ఇద్దరు హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు బుధవారం నాగార్జునసాగర్ వెళ్లారు. తిరిగి వెళ్తున్న సమయంలో పాలెం శివారులో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి:కొత్త రెవెన్యూ చట్టం అద్భుతాలు సృష్టించదు: చాడ వెంకట్రెడ్డి