మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంటలో విషాదం జరిగింది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం కోమార్ లింగంపల్లికి చెందిన వెంకటేష్(28) ఆర్ఎంపీ డాక్టర్‌గా చేస్తున్నాడు. నర్వ మండలానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలపగా వారు అంగీకరించలేదు. ఇద్దరి కులాలు వేరవడం... బాలిక మైనర్ కావడం వల్ల పెళ్లికి అడ్డు చెప్పారు.
పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. ప్రేమజంట ఆత్మహత్య - పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్య
పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్ల ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో జరిగింది. కులాలు వేరవ్వడం... అమ్మాయి వయసు తక్కువ కావడం తదితర కారణాలతో పెళ్లికి నిరాకరించారు. మనస్తాపం చెందిన ప్రేమికులు గుళికలు తిని బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాము కలిసి బతకలేమని అనుకున్నారో ఏమో... అక్టోబర్ 10న ఇంటి నుంచి వెళ్లిపోయారు. చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి దేవాలయం వెనుక గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నారు. తమ కుమార్తె కనిపించకపోయేసరికి బాలిక తండ్రి సోమవారం ఉదయం నర్వ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చరవాణిల సిగ్నల్ ఆధారంగా ఘటన స్థలిని గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లిన రోజే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలం చిన్నచింతకుంట మండలం పరిధిలో ఉండడం వల్ల కేసను చిన్నచింతకుంట పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.