తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'నా భార్యను తీసుకెళ్లిపోయారు... న్యాయం చేయండి'

మేము ప్రేమ వివాహం చేసుకున్నాం.. మా పెళ్లి నా భార్య ఇంట్లో వారికి ఇష్టం లేదు.. పోలీసుల సాయంతో నా భార్యను.. ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్లిపోయారు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నన్నే వేధిస్తున్నారు.. మీరే నన్ను కాపాడాలంటూ ఎస్పీ కార్యాలయాన్ని ఓ యువకుడు ఆశ్రయించాడు.

'నా భార్యను తీసుకెళ్లిపోయారు... న్యాయం చేయండి'
'నా భార్యను తీసుకెళ్లిపోయారు... న్యాయం చేయండి'

By

Published : Sep 22, 2020, 11:46 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను అమ్మాయి తరఫు పెద్దలు చంపుతామని బెదిరిస్తున్నారని ఏపీలోని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాడో యువకుడు. గుంటూరు శారదా కాలనీకి చెందిన దిలీప్ కుమార్.. విజయవాడకు చెందిన ఓ యువతిని జులై 29న చర్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి రెండు నెలల గర్భిణీ.

తాను లేని సమయంలో ఇంటికి వచ్చి తన భార్యను.. ఆమె తరఫు పెద్దలు తీసుకువెళ్లిపోయారని దిలీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అరండల్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు తమనే వేధిస్తున్నారని ఆరోపించారు. అరండల్​పేట సీఐ తమను బెదిరించారని దిలీప్, అతని తల్లి రత్నకుమారి ఆరోపించారు. తన భార్యను తిరిగి తమ ఇంటికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని దిలీప్ కోరారు.

'మాది లవ్ మ్యారేజ్. నా భార్య తరపు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో తనను తీసుకువెళ్లిపోయారు. ఇప్పుడు తాను రెండు నెలల గర్భిణీ. అరండల్​పేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే.. మాపై బెదిరింపులకు దిగారు. అరండల్​పేట సీఐ మమ్మల్ని దూషించారు'

-దిలీప్ కుమార్

'నా భార్యను తీసుకెళ్లిపోయారు... న్యాయం చేయండి'

ఇదీ చదవండి:మణికట్టు కోసుకొని ఆపై ఉరి వేసుకొని.. యువకుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details