నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఎప్పటికి ఒక్కటి కాలేమని భావించిన జంట... వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగుమందు సేవించి ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఘటనాస్థలిలో యువకుడు మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి ప్రాణాలు విడిచింది.
కలిసి జీవించలేక... వేర్వేరుగా బతకలేక... ప్రేమజంట ఆత్మహత్య - గుడివాడలో ప్రేమజంట ఆత్మహత్య
ఎప్పటికి ఒక్కటి కాలేమని భావించిన ఓ ప్రేమజంట.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రాచకొండ శీను, చిత్తలూరి నాగేశ్వరి.. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు శీనుకు పది నెలల కిందట మరో యువతితో వివాహం జరిపించారు. శీనుకు వివాహం జరిగినప్పటికీ నాగేశ్వరితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.
శాశ్వతంగా కలిసి జీవించడం కష్టమని భావించిన ఇరువురు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసున్నారు. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పంచనామా నిర్వహించారు.